Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి భారీగా నీరు... నాగార్జునసాగర్ లో 10 గేట్లు ఎత్తి నీటి విడుదల

Water released from Nagarjuna Sagar project
షార్ట్స్‌లో చూడండి
శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అక్కడ 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. శ్రీశైలం నుంచి ఇన్ ఫ్లో పెరగడంతో నాగార్జునసాగర్ జలాశయం వద్ద కూడా 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. 

ప్రస్తుతం నాగార్జునసాగర్ కు 4.72 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. 1.17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపిస్తున్నారు. ప్రాజెక్టు అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 586 అడుగుల మేర నీరు ఉంది.
Go Back to Shorts
Nagarjuna Sagar
Water
Release
Rains
Krishna River

More Telugu News