CM Jagan: నేడు బాపట్ల జిల్లాలో సీఎం జగన్ పర్యటన

CM Jagan will tour in Bapatla district today
  • విద్యా దీవెన నిధులు విడుదల చేయనున్న సీఎం
  • 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ది
  • తల్లుల ఖాతాలకు నగదు బదిలీ

ఏపీ సీఎం జగన్ నేడు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జగనన్న విద్యా దీవెన మూడో త్రైమాసికం నిధులను విడుదల చేయనున్నారు. 11.02 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేయనున్నారు. 

బాపట్ల జిల్లా పర్యటన కోసం సీఎం జగన్ ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరనున్నారు. ఉదయం 10.10 గంటలకు బాపట్ల చేరుకుంటారు. కార్యక్రమం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 12.40 గంటలకు తిరుగు పయనమవుతారు.

  • Loading...

More Telugu News