AP ECET: ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల

AP ECET results declared
షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఈసెట్) ఫలితాలు నేడు విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫలితాలను విడుదల చేశారు. జులై 22న ఈ పరీక్ష నిర్వహించారు. ఏపీ ఈసెట్ లో ఓవరాల్ గా 92.36 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పూర్తి ఫలితాలను cets.apsche.ap.gov.in వెబ్ సైట్లో ఉంచారు. ఏపీ ఈసెట్ స్కోరు కార్డును ఈ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నిర్దేశిత విండోలో రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ ఐడీ వివరాలు నమోదు చేసి పరీక్ష స్కోరుకార్డును పొందవచ్చు.
Go Back to Shorts
AP ECET
Results
APSCHE
Andhra Pradesh

More Telugu News