ఎంపీ గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు: పీతల సుజాత

09-08-2022 Tue 18:45
  • ఎంపీ మాధవ్ నగ్న వీడియో కాల్ దుమారం
  • వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం
  • మాధవ్ బరితెగించాడన్న పీతల సుజాత
  • మహిళలను బెదిరించే స్థాయికి వైసీపీ దిగజారిందని వ్యాఖ్యలు
Peetala Sujatha reacts to MP Gorantla Madhav video call issue
ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఈ వ్యవహారంలో టీడీపీ మహిళా నేత, మాజీ మంత్రి పీతల సుజాత స్పందించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పై ఇప్పటికీ చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. 

మంత్రులు, ఎంపీలు ఏం చేసినా చూస్తూ ఉండాలని ప్రజలకు సందేశం ఇస్తున్నారని విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్ బరితెగించాడని పీతల సుజాత వ్యాఖ్యానించారు. మహిళలను బెదిరించే స్థాయికి వైసీపీ దిగజారిందని అన్నారు.