సుధీర్ బాబు సినిమా అప్ డేట్

09-08-2022 Tue 17:55
  • విభిన్న కథా చిత్రంగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'
  • ఇంద్రగంటితో సుధీర్ బాబు మూడో సినిమా ఇది 
  • సంగీత దర్శకుడిగా వివేక్ సాగర్ 
  • ఈ నెల 10వ తేదీన ప్రకటించనున్న రిలీజ్ డేట్
Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Update
సుధీర్ బాబు - కృతి శెట్టి జంటగా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా రూపొందింది. మైత్రీ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముస్తాబై చాలాకాలమే అయింది. అయితే సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తూ రావడం వలన ఆలస్యమైంది. 

ఇక ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కి ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఆ విషయాన్ని ఈ నెల 10వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు ప్రకటించనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కొంతసేపటి క్రితం విడుదల చేశారు. 'వినాయకచవితి' సందర్భంగా ఈ సినిమాను విడుదల చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు.  

ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. శ్రీనివాస్ అవసరాల .. వెన్నెల కిశోర్ .. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 'సమ్మోహనం' సినిమాతో సుధీర్ బాబుకి హిట్ ఇచ్చిన ఇంద్రగంటి, ఈ సినిమాతో మరో హిట్ ఇస్తాడేమో చూడాలి. ఇక పెద్దగా గ్యాప్ లేకుండా కృతి సినిమాలు విడుదలవుతుండటం విశేషం.