లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

08-08-2022 Mon 16:27 | Business
  • ఉత్సాహంగా నేటి ట్రేడింగ్
  • ప్రభావం చూపిన అమెరికా ఫ్యాక్టర్ 
  • ప్రైవేటు రంగ బ్యాంకులకు లాభాలు
  • ఎస్బీఐకి నిరాశ
  • డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.21
Indian stock markets ended with profits
భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ ఉత్సాహంగా కదలాడాయి. దేశీయ మార్కెట్లు 0.8 శాతం వృద్ధితో లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 465.14 పాయింట్ల మేర లాభపడి 58,853.07 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా ఇవాళ ఆశావహరీతిలో ఫలితాలు అందుకుంది. నిఫ్టీ 127.60 పాయింట్ల వృద్ధితో 17,525.10 వద్ద స్థిరపడింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, కోల్ ఇండియా షేర్లు పైపైకి ఎగబాకగా, బీపీసీఎల్, ఎస్పీబై షేర్ల కొద్దిమేర నష్టపోయాయి. 

ముఖ్యంగా, ఆటోమొబైల్, మెటల్, ప్రైవేటు బ్యాంకులు ఇవాళ్టి ట్రేడింగ్ లో లాభాలు కళ్లజూశాయి. కానీ ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ మాత్రం నిరాశాజనక ఫలితాలు నమోదు చేసింది. 

అమెరికాలో ఉద్యోగాలకు సంబంధించి కీలక నివేదిక, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారీ స్థాయిలో వడ్డీ రేట్ల పెంపుదల నిర్ణయం తీసుకుంటుందన్న అంచనాలు ప్రపంచ మార్కెట్ స్థితిగతులపై ప్రభావం చూపించాయి. ఇక, డాలర్ తో రూపాయి మారకం విలువ రూ.79.21గా ఉంది.