Chiranjeevi: కిడ్నీలు ఫెయిలైన అభిమాని చివరి కోర్కె తీర్చిన చిరంజీవి

  • మొగల్తూరుకు చెందిన నాగరాజు చిరంజీవికి వీరాభిమాని
  • రెండు కిడ్నీలు పాడైన వైనం
  • మృత్యువుతో పోరాడుతున్న నాగరాజు
  • చలించిపోయిన చిరంజీవి
Megastar Chiranjeevi met his ardent fan

అభిమానుల పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రదర్శించే ఆపేక్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, తన సొంతూరు మొగల్తూరుకు చెందిన ఓ అభిమాని చివరికోర్కె తీర్చారు. ఆ అభిమాని పేరు నాగరాజు. నాగరాజుకు రెండు కిడ్నీలు పాడయ్యాయి. తన చివరికోర్కెగా తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని కలవాలనుందని మనసులో మాట వెల్లడించాడు. 

ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి నాగరాజును తన నివాసానికి ఆహ్వానించారు. మృత్యువుతో పోరాడుతున్న తన వీరాభిమానిని చూసి చలించిపోయారు. ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని నాగరాజును పరామర్శించారు. దాదాపు గంటపాటు ఆ అభిమానితో ముచ్చటించారు. అతడిలో మానసిక స్థైర్యం కలిగించడమే కాదు, ఆర్థికసాయం కూడా అందించారు.
.

More Telugu News