మీ కోసం మరో 20 ఏళ్లు కష్టపడతాను: నితిన్

Macharla Niyojakavargam movie update
  • ఈ నెల 12న వస్తున్న 'మాచర్ల నియోజకవర్గం'
  • నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
  • 20 ఏళ్లు ఆదరించిన ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పిన నితిన్ 
  • ఈ సారి గట్టి హిట్ కొడతామంటూ  వ్యాఖ్య  
నితిన్ హీరోగా రూపొందిన 'మాచర్ల నియోజకవర్గం' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ .. 20 ఏళ్లుగా తనను ఎంకరేజ్ చేస్తూ వచ్చినందుకు అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. అభిమానుల కోసం మరో 20 ఏళ్లు కష్టపడటానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. 

"శేఖర్ కి ఇది మొదటి సినిమానే అయినా అద్భుతంగా తీశాడు. ఈ సినిమాలో డాన్స్ .. ఫైట్స్ కచ్చితంగా మీకు చాలా కొత్తగా కనిపిస్తాయి. ముఖ్యంగా వెన్నెల కిశోర్ కామెడీ మిమ్మల్ని పడి పడి నవ్విస్తుంది. సముద్రఖని వంటి గొప్ప నటుడితో కలిసి నటించినందుకు గర్వపడుతున్నాను. ఆయన డైరెక్షన్ లోను ఒక సినిమా చేయాలనుంది. 

మహతి స్వరసాగర్ పాటలన్నిటినీ ఇప్పటికే మీరంతా హిట్ చేశారు. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇరగదీశాడు. కేథరిన్ .. కృతి ఇద్దరి పాత్రలు కూడా మీకు వెంటనే కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నాను. ఆ నమ్మకాన్ని మీరంతా నిలబెడతారని ఆశిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.
Go Back to Shorts
Nithin
Krithi Shetty
Catherine
Macharla Niyojakavargam Movie

More Telugu News