Malasri: వెండితెరకు పరిచయమవుతున్న సీనియర్ నటి మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్

Malasri daughter Radhana Ram signed for first film
  • దక్షిణాది చిత్రాల్లో నటించిన మాలాశ్రీ
  • తెలుగులోనూ అనేక హిట్ చిత్రాలతో గుర్తింపు
  • మాలాశ్రీ కుమార్తె రాధనా రామ్ తెరంగేంట్రం
  • దర్శన్ హీరోగా కొత్త చిత్రం

కన్నడ నటి మాలాశ్రీ దాదాపు అన్ని దక్షిణాది భాషల్లో నటించి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించింది. తెలుగులోనూ ప్రేమఖైదీ, బావబావమరిది వంటి హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కన్నడ నిర్మాత రామును పెళ్లి చేసుకుంది. రాము కరోనా మహమ్మారి కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే. 

కాగా, ప్రస్తుతం మాలాశ్రీ తన కుమార్తె రాధనా రామ్ ను వెండితెరకు పరిచయం చేస్తుంది. కన్నడ చిత్రంతో రాధనా రామ్ అరంగేట్రం చేస్తోంది. ఇందులో దర్శన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూస్ రాక్ లైన్ వెంకటేశ్ నిర్మిస్తుండడంతో హైప్ నెలకొంది. నేడు ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. 

ఈ చిత్రం కన్నడ, తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. కాగా, తనను ఆదరించినట్టే దక్షిణాది ప్రేక్షకులు తన కుమార్తెను కూడా ఆదరిస్తారని మాలాశ్రీ భావిస్తోంది.
.

  • Loading...

More Telugu News