US Shooting: అమెరికాలో మరోసారి కాల్పుల మోత..

US Shooting 4 Killed In Mass Shooting In Ohio Neigbhourhood Buttler township
  • ఓహియో రాష్ట్రంలోని బట్లర్ టౌన్ షిప్ లో ఉన్మాదం
  • కాల్పులతో విరుచుకుపడడంతో నలుగురు దుర్మరణం
  • అనంతరం కారులో పరారైన నిందితుడు
అమెరికాలో మరో ఉన్మాది తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఓహియో రాష్ట్రం బట్లర్ టౌన్ షిప్ లో ఓ దుండగుడు కాల్పులకు దిగగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి కారులో పరారయ్యాడు. కారు వివరాల ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

దుండగుడి కారు ఫొటోను పోలీసులు విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. నిందితుడిని స్టీఫెన్ మల్రోగా అనుమానిస్తున్నట్టు బట్లర్ టౌన్ షిప్ పోలీస్  చీఫ్ జాన్ పోర్టర్ తెలిపారు. ఎఫ్ బీఐ, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, ఫైర్ ఆర్మ్స్ అండ్ ఎక్స్ ప్లోజివ్స్ తరఫున గాలింపు చర్యలు చేపట్టినట్టు ప్రకటించారు. నిందితుడికి లెక్సింగ్టన్, కెంటకీ, ఇండియానాపోలిస్, చికాగోలతో సంబంధం ఉందని, ఈ పట్టణాల్లో ఎక్కడైనా ఉండొచ్చని ఎఫ్ బీఐ పేర్కొంది. 

US Shooting
4 Killed
Mass Shooting
Ohio
Buttler township

More Telugu News