Team India: రాణించిన టాపార్డర్... వెస్టిండీస్ పై టీమిండియా భారీస్కోరు

Team India set huge target to West Indies
  • ఫ్లోరిడాలో మ్యాచ్
  • టాస్ నెగ్గిన వెస్టిండీస్
  • మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్
  • ఆకట్టుకున్న పంత్, రోహిత్ శర్మ
వెస్టిండీస్ తో నాలుగో టీ20 మ్యాచ్ లో భారత టాపార్డర్ బ్యాట్స్ మెన్ తలోచేయి వేయడంతో భారీ స్కోరు సాధ్యమైంది. ఫ్లోరిడాలోని లాడర్ డేల్ ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్ కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. 

కెప్టెన్ రోహిత్ శర్మ (33), సూర్యకుమార్ యాదవ్ (24) జోడీ తొలి వికెట్ కు 53 పరుగులు జోడించి శుభారంభం అందించింది. వీరిద్దరూ అవుట్ కాగా, రిషబ్ పంత్ (44), దీపక్ హుడా (21) జోడీ స్కోరు బోర్డును ముందుకు ఉరికించింది. చివర్లో సంజూ శాంసన్ (30 నాటౌట్), అక్షర్ పటేల్ (20 నాటౌట్) దూకుడుగా ఆడడంతో స్కోరు 190 పరుగుల మార్కు దాటింది. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ 2, ఒబెద్ మెక్ కాయ్ 2, అకీల్ హోసీన్ 1 వికెట్ తీశారు.
Team India
West Indies
4th T20
Florida

More Telugu News