Naga Chaitanya: సమంతను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటా: నాగచైతన్య

Naga Chaitanya says he always be respectful to Samantha
  • ప్రేమించి పెళ్లిచేసుకున్న నాగచైతన్య, సమంత
  • విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించిన వైనం
  • ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఇరువురి వ్యవహారం
  • తాజాగా ఈ అంశంపై స్పందించిన నాగచైతన్య
ఒకప్పుడు టాలీవుడ్ అందాల జంటగా పేరుగాంచిన నాగచైతన్య, సమంత... తాము విడిపోతున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించడం తెలిసిందే. వారు ఎందుకు విడిపోయారన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియరాలేదు. నాగచైతన్య, సమంత ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉన్నారు. బాలీవుడ్ చిత్రం లాల్ సింగ్ చడ్డాలో నటించిన నాగచైతన్య ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమంతతో విడాకుల వ్యవహారంపై స్పందించారు. 

తన మాజీ భార్య సమంత అంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందని, ఆమెను ఎప్పటికీ గౌరవిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. పరస్పర అంగీకారంతోనే తాము విడిపోయామని నాగచైతన్య వెల్లడించారు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నామని, చెప్పామని అన్నారు. కానీ, కొందరు ఈ విషయంలో పనిగట్టుకుని ఏవేవో ఊహాగానాలు సృష్టిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Naga Chaitanya
Samantha
News
Tollywood

More Telugu News