నా తమ్ముడు ఎంతో సపోర్ట్ చేశాడు.. లవ్యూ నాన్నా: కల్యాణ్ రామ్

  • ఘన విజయం సాధించిన కల్యాణ్ రామ్ 'బింబిసార' 
  • మంచి కంటెంట్ తో సినిమా తీస్తే ప్రజలు థియేటర్లకు వస్తారన్న కల్యాణ్ రామ్
  • ఫస్ట్ ఆడియన్ గా తమ్ముడు చాలా సపోర్ట్ చేశాడని వ్యాఖ్య
Kalyan Ram praises his brother Junior NTR

నందమూరి కల్యాణ్ రామ్ తాజా చిత్రం 'బింబిసార' ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం హిట్ కావడంపై సినీ ప్రముఖులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ విజయంతో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ, ఇది సినీ అభిమానుల విజయమని చెప్పారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే... ప్రజలు థియేటర్లకు వస్తారని నిరూపించారని అన్నారు. సినిమాను ప్రేక్షకులు బతికించారని చెప్పారు. 

ఇక ఈ సినిమాను తన వద్దకు తీసుకొచ్చిన వశిష్టకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదని అన్నారు. ఈ సినిమాను థియేటర్ లో చూస్తుంటే తనకే గూజ్ బంప్స్ వచ్చాయని చెప్పారు. ఈ సినిమాను అందరి కంటే ముందు చూసి, ఫస్ట్ ఆడియన్ గా తన తమ్ముడు తారక్ ఎంతో సపోర్ట్ చేశాడని... 'లవ్ యూ నాన్నా' అంటూ ఆప్యాయతను వ్యక్తపరిచారు.

More Telugu News