Chiranjeevi: సీతారామం, బింబిసార చిత్రాలపై చిరంజీవి ఆసక్తికర ట్వీట్

Megastar Chiranjeevi congratulates SITARAMAM BIMBISARA movies teams
  • రెండు చిత్రాలు విజయం సాధించడం సంతోషకరమన్న మెగాస్టార్
  • ఇండస్ట్రీకి ఊరటను, ఉత్సాహాన్ని ఇచ్చాయన్న చిరు
  • చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి 

‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు ఈ శుక్రవారం విడుదలై మంచి స్పందన దక్కించుకోవడం పట్ల మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. రెండు సినిమాల నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 

ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ రెండు చిత్రాల విజయం ఎంతో ఊరటను, ఉత్సాహాన్ని ఇచ్చిందని అభిప్రాయపడ్డారు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తాయని మరోసారి నిరూపించాయన్నారు. ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు రెండూ విజయం సాధించడం ఎంతో సంతోషకరమన్నారు. 

కరోనా తర్వాత ఓటీటీలకు డిమాండ్ పెరగడంతో పాటు, సినిమా టికెట్ల రేటు భారీగా పెరిగిన కారణంగా ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. స్టార్ హీరోలు నటించిన పెద్ద చిత్రాలు సైతం బాగా లేకుంటే ఎక్కువ రోజులు థియేటర్లలో నడవటం లేదు. ఈ పరిస్థితుల్లో దుల్కర్ సల్మాన్  హీరోగా నటించిన ‘సీతారామం’, కల్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘బింబిసార’ చిత్రాలు భారీ అంచనాలేమీ లేకపోయినా హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News