Kalyanram: 'బింబిసార' సీక్వెల్ మరింత గ్రాండ్ గా ఉంటుంది: కల్యాణ్ రామ్

  • నిన్ననే థియేటర్లకు వచ్చిన 'బింబిసార'
  • తొలి ఆటతోనే వచ్చిన హిట్ టాక్
  • ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పిన కల్యాణ్  రామ్ 
  • సీక్వెల్ చేసే ఆలోచన ఉందంటూ వ్యాఖ్య   
Bimbisara movie update

కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందిన 'బింబిసార' నిన్ననే థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో సాయంత్రానికి థియేటర్ల దగ్గర రద్దీ పెరిగింది. 'బింబిసార'గా కల్యాణ్ రామ్ ఈ సినిమాలో బాగా చేశాడు. తొలి ఆటతోనే ఇలా ఆడియన్స్ ను ప్రభావితం చేయడం ఆయన కెరియర్లోనే ఫస్టు టైమ్ అని చెప్పాలి.
 
తాజాగా ఈ సినిమా గురించి కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. 'బింబిసార'ను ఈ స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తాను అనుకున్నట్టే కీరవాణిగారి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలిచిందనీ, ఈ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉందని చెప్పాడు. సీక్వెల్ మరింత గ్రాండ్ గా ఉండేలా చూస్తామని అన్నాడు.

'బింబిసార'లో సీక్వెల్ కి తగిన కంటెంట్ ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత లేకపోవడం .. రాజు పాత్ర వైపు నుంచి రొమాన్స్ పాళ్లు లోపించడం .. పవర్ఫుల్ డైలాగ్స్ లేకపోవడం జరిగింది. ఈ లోపాలను సరిచేసుకుంటూ వెళితే సీక్వెల్ కూడా ఆకట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

More Telugu News