Assam: ప్రియుడు హెచ్ఐవీ బాధితుడని తెలిసి.. అతడి రక్తాన్ని ఎక్కించుకున్న యువతి

  • అసోంలోని కామరూప్ జిల్లాలో ఘటన
  • ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడితో ప్రేమ
  • తమను విడదీయకుండా ప్రియుడి రక్తాన్ని ఎక్కించుకున్న యువతి
  • యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో యువకుడి అరెస్ట్
Assam girl infused HIV Blood from her lover

ప్రేమికుడు హెచ్ఐవీ బాధితుడని తెలిసినా అతడితోనే కలిసి నడవాలని నిర్ణయించుకున్న ప్రేమికురాలు.. అతడి రక్తాన్ని ఎక్కించుకుని తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారింది. అసోంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. కామరూప్ జిల్లాలోని సువల్‌కచికి చెందిన 19 ఏళ్ల యువతికి మూడేళ్ల క్రితం ఫేస్‌బుక్‌లో పొరుగూరికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. అది క్రమంగా మొగ్గతొడిగి ప్రేమగా మారింది. ఆపై ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. 

ఈ క్రమంలో ఒక రోజు తాను ప్రేమిస్తున్న యువకుడు హెచ్ఐవీ బాధితుడని యువతికి తెలిసింది. అయినప్పటికీ అతడితోనే జీవితాన్ని పంచుకోవాలని భావించిన ఆమె.. మూడుసార్లు అతడితో కలిసి ఊరొదిలి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు వెతికి తీసుకొచ్చారు. దీంతో తాము పెళ్లి చేసుకున్నా తమను విడదీస్తారని భయపడింది. 

ఇకపై అలా కాకూడదంటే తాను కూడా హెచ్ఐవీ బాధితురాలిగా మారిపోవాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఓ రోజు అతడి రక్తాన్ని ఆమె తన శరీరంలోకి ఎక్కించుకుంది. విషయం తెలిసిన యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిని అరెస్ట్ చేశారు. యువతికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో యువతి హెచ్ఐవీ రక్తాన్ని ఎక్కించుకున్నట్టు తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News