Bigg Boss: త్వరలోనే తెలుగు బిగ్ బాస్ షో కొత్త సీజన్... ప్రోమో ఇదిగో!

  • ఇప్పటిదాకా బిగ్ బాస్ ఐదు సీజన్లు
  • త్వరలోనే సీజన్-6 ప్రారంభం
  • ఈసారి రెట్టింపు వినోదం ఖాయమన్న స్టార్ మా
Telugu Bigg Boss show new season starts soon

తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరుగాంచిన బిగ్ బాస్ షో కొత్త సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా చానల్ విడుదల చేసింది. అన్ని వయసుల వారిని అలరించేందుకు బిగ్ బాస్ సీజన్-6 త్వరలోనే ప్రారంభం కానుందని స్టార్ మా పేర్కొంది. భావోద్వేగాల సమాహారం, రంగుల హరివిల్లు అంటూ బిగ్ బాస్ షోని అభివర్ణించింది. ఈసారి బిగ్ బాస్ కన్ను కాస్త పెద్దదే అని, ప్రేక్షకులకు రెట్టింపు వినోదం గ్యారంటీ అని స్పష్టం చేసింది. 

తెలుగులో ఇప్పటివరకు బిగ్ బాస్ షో 5 సీజన్లు విజయవంతంగా పూర్తిచేసింది. ఇటీవల బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కూడా ప్రసారమైంది. అయితే అది అన్ని వర్గాలను చేరుకోలేకపోయిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, బిగ్ బాస్ షో మరోసారి బుల్లితెరపై విజృంభణకు సిద్ధమవుతోంది.

More Telugu News