YSRCP: పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో జ‌గ‌న్‌కు ద‌క్కిన గౌర‌వ‌మిది: వైసీపీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌

ysrcp mp margani bbharat tweet on both houses of parliament run by his party mps for a while
  • లోక్ స‌భ ప్యానెల్ స్పీక‌ర్‌గా మిధున్ రెడ్డి
  • రాజ్య‌స‌భ ప్యానెల్ చైర్మ‌న్‌గా సాయిరెడ్డి
  • ఉభ‌య స‌భ‌ల‌ను ఇద్ద‌రూ న‌డిపించిన వైనం
  • అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్ చేసిన మార్గాని
పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో వైసీపీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి అరుదైన గౌర‌వం ద‌క్కిందంటూ ఆ పార్టీ యువ నేత‌, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎంపీ మార్గాని భ‌రత్ శుక్ర‌వారం చెప్పారు. ఈ మేర‌కు ఆయ‌న‌ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ట్వీట్‌ను పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన రెండు ఫొటోల‌ను కూడా ఆయ‌న పంచుకున్నారు.

లోక్ స‌భలో ప్యానెల్ స్పీకర్‌గా ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఇటీవ‌లే లోక్ స‌భ‌ను కొద్దిసేపు న‌డిపించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత గురువారం రాజ్య‌స‌భ ప్యానెల్ చైర్మ‌న్ హోదాలో వైసీపీ ఎంపీ విజ‌యసాయిరెడ్డి కూడా రాజ్య‌స‌భ‌ను కాసేపు న‌డిపించారు. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన ఫొటోల‌ను పోస్ట్ చేసిన మార్గాని భ‌ర‌త్‌... ఈ త‌ర‌హా ప‌రిణామం ఉభ‌య స‌భ‌ల్లో జ‌గ‌న్‌కు, వైసీపీకి ద‌క్కిన గౌర‌వ‌మేన‌ని పేర్కొన్నారు. 
YSRCP
YS Jagan
Parliament
Lok Sabha
Rajya Sabha
Margani Bharat
Vijay Sai Reddy
Peddireddy Midhun Reddy
Panel Speaker
Panel Chairman

More Telugu News