India: కామన్వెల్త్ క్రీడల్లో పతకం దిశగా భారత హాకీ జట్టు

India hockey team enters into semis in Commonwealth Games
  • వేల్స్ పై ఘనవిజయం
  • 4-1తో నెగ్గిన భారత్
  • హ్యాట్రిక్ చేసిన హర్మన్ ప్రీత్ సింగ్
  • సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన భారత్
కామన్వెల్త్ క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇవాళ పూల్-బి లో భాగంగా వేల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ 4-1తో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ సింగ్ 3 గోల్స్ తో భారత్ విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. 

హర్మన్ ప్రీత్ మ్యాచ్ 19వ, 20వ, 40వ నిమిషాల్లో గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్ గా మలిచిన హర్మన్ ప్రీత్, మరొకటి స్పాట్ గోల్ చేశాడు. ఇక మ్యాచ్ 49వ నిమిషంలో గుర్జంత్ సింగ్ మరో గోల్ కొట్టడంతో భారత్ ఆధిక్యం మరింత పెరిగింది. ఇక, వేల్స్ తరఫున గారెత్ ఫుర్లాంగ్ 55వ నిమిషంలో ఏకైక గోల్ చేశాడు.
India
Hockey
Semis
Commonwealth Games
Birmingham

More Telugu News