Karumanchi Raghu: టాలీవుడ్ కమెడియన్ కారుమంచి రఘు తండ్రి కన్నుమూత

Tollywood comedian Karumanchi Rghu father dies of illness
  • అనారోగ్యంతో రఘు తండ్రి వెంకట్రావు మృతి
  • భారత సైన్యంలో పనిచేసిన వెంకట్రావు  
  • సంతాపం తెలిపిన టాలీవుడ్ ప్రముఖులు
టాలీవుడ్ కమెడియన్ కారుమంచి రఘు కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రఘు తండ్రి వెంకట్రావు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్యంగా బాగా క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. కారుమంచి రఘు తండ్రి వెంకట్రావు భారత సైన్యంలో పనిచేశారు. పదవీవిరమణ అనంతరం ఇంటివద్దే ఉంటున్నారు. పితృవియోగంతో బాధపడుతున్న రఘుకు టాలీవుడ్ సహచరులు సంతాపం తెలియజేస్తున్నారు.
Karumanchi Raghu
Venkatrao
Father
Death
Tollywood

More Telugu News