Vijayasai Reddy: ఈ ఘనత జగన్, భారతమ్మ, ఏపీ ప్రజల దీవెనల వల్లే సాధ్యమైంది: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy thanked for being Rajya Sabha panel vice chairman
  • రాజ్యసభ చైర్మన్ స్థానంలో విజయసాయి
  • ప్యానెల్ వైస్ చైర్మన్ గా అవకాశం
  • ఆరేళ్ల కిందట ప్రస్థానం ప్రారంభమైందని వెల్లడి
  • ఇప్పుడు అరుదైన అవకాశం దక్కిందని వివరణ
ఇవాళ రాజ్యసభలో చైర్మన్ స్థానంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శనమివ్వడం తెలిసిందే. ప్యానెల్ వైస్ చైర్మన్ హోదాలో ఇవాళ ఆయన సభా కార్యక్రమాలను నిర్వహించారు. తనకు అరుదైన అవకాశం దక్కడంపై విజయసాయి సోషల్ మీడియాలో స్పందించారు. 

తొలిసారిగా రాజ్యసభను నడిపించే అవకాశం దక్కడాన్ని విశిష్ట గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఆరేళ్ల కిందట రాజ్యసభలో వైసీపీ తరఫున ఒకే ఒక్కడ్ని ఉండేవాడ్నని, ఇప్పుడిలా చైర్మన్ స్థానంలో సభను నడిపించే భాగ్యం లభించిందని వివరించారు. ఇదంతా కూడా జగన్, భారతమ్మ, ఏపీ ప్రజల దీవెనల వల్లే సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విజయసాయి పంచుకున్నారు.
Vijayasai Reddy
Panel Vice Chairman
Rajya Sabha
CM Jagan
YS Bharathi
YSRCP
Andhra Pradesh

More Telugu News