'స్వాతిముత్యం' రిలీజ్ డేట్ వాయిదా!

  • విభిన్నమైన ప్రేమకథగా 'స్వాతిముత్యం'
  • ముందుగా చెప్పిన రిలీజ్ డేట్ ఈ నెల 13
  • వాయిదా వేసినట్టుగా చెప్పిన మేకర్స్ 
  • కొత్త రిలీజ్ డేట్ త్వరలో చెబుతామని వెల్లడి
Swathi Muthyam Movie Update

బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు గణేశ్ కూడా నటన దిశగా అడుగులు వేశాడు. తన తొలి చిత్రంగా 'స్వాతిముత్యం' చేశాడు. సితార నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకి లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహించాడు. దర్శకుడికి కూడా తెలుగులో ఇదే ఫస్టు సినిమా. వర్ష బొల్లమ్మ కథనాయికగా నటించింది.

ఈ సినిమాను ఆగస్టు 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. అయితే ఆ రోజున ఈ సినిమా  థియేటర్స్ కి రావడం లేదనీ  .. రిలీజ్ డేట్ ను వాయిదా వేశామని కొంతసేపటి క్రితం మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని అన్నారు.

ప్రేమ .. పెళ్లి .. ఆ రెండిటికి మధ్య  కనిపించే ఎమోషన్స్ తో 'స్వాతిముత్యం' రూపొందింది. ప్రేమకథలు చాలానే వచ్చినా, ఇందులో ఒక కొత్త పాయింట్ ను టచ్ చేసినట్టుగా దర్శకనిర్మాతలు చెబుతున్నారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ కి వస్తుందనేది చూడాలి.

More Telugu News