Chandu: నాగ్ తో 'విక్రమ్'లాంటి సినిమా చేయాలనుందట!

Nagarjuna in Chandu Mondeti Movie
  • 'కార్తికేయ'తో హిట్ కొట్టిన చందూ మొండేటి
  • నిఖిల్ .. అనుపమ జోడీగా రూపొందిన సీక్వెల్
  • ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న టీమ్    
  • ఈ నెల 12వ తేదీన రానున్న సీక్వెల్
చందూ మొండేటి నుంచి గతంలో వచ్చిన 'కార్తికేయ' భారీ విజయాన్ని నమోదు చేసింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ గా ఆయన 'కార్తికేయ 2' చేశాడు. నిఖిల్ హీరోగా చేసిన ఈ సినిమాలో ఆయన జోడీగా అనుపమ పరమేశ్వరన్ అలరించనుంది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో చందూ మాట్లాడుతూ .. "ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ తో మేము వస్తున్నాము. కంటెంట్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాము. తరువాత ప్రాజెక్టును గురించి ఇప్పుడే చెప్పలేను. 

నా అభిమాన నటుడు నాగార్జున గారు. ఆయనతో 'విక్రమ్' వంటి ఒక యాక్షన్ సినిమాను చేయాలనుంది. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నాగార్జున గారిని చూపించాలని ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. ఆల్రెడీ చందూ ఆ ప్రయత్నాలు మొదలుపెట్టాడనే టాక్ బయటికి వచ్చింది. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయన్నది చూడాలి.
Chandu
Nagarjuna
Tollywood

More Telugu News