ఇగో వల్ల కేంద్రం కళ్లు మూసుకుపోయాయి: రాహుల్ గాంధీ

  • ధరల పెరుగుదలపై విపక్షాల రగడ
  • పార్లమెంటులో నిర్మలా సీతారామన్ జవాబు
  • దేశానికి ఆర్థికమాంద్యం భయం అక్కర్లేదని వెల్లడి
  • మండిపడిన రాహుల్
  • వీళ్లకు ద్రవ్యోల్బణం ఎలా కనిపిస్తుందన్న రాహుల్
Rahul Gandhi take a dig on Nirmala Sitaraman answer to prices rise

భారత్ ఆర్థిక మాంద్యంలోకి జారుకునే అవకాశాలే లేవని, దేశ ఆర్థిక స్థితిగతులు బాగానే ఉన్నాయని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో పేర్కొనడంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇగో వల్ల కేంద్రం కళ్లు మూసుకుపోయాయని విమర్శించారు. అలాంటప్పుడు వారికి ద్రవ్యోల్బణం ఎలా కనబడుతుందని ప్రశ్నించారు. ఉచిత నిధుల కింద దేశ ఆస్తులను తమ మిత్రులకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ధరల పెరుగుదలపై లోక్ సభలో చర్చ సందర్భంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News