Bimbisara: జనాల్లోకి 'బింబిసార' ప్రత్యేక వాహనాలు... ఫొటోలు ఇవిగో!

Canter vehicles displays Bimbisara trailer and clippings spotted at some places in state
  • కల్యాణ్ హీరోగా ఫాంటసీ యాక్షన్ మూవీ బింబిసార
  • ఆగస్టు 5న విడుదల
  • ప్రచార కార్యక్రమాలు ముమ్మరం
  • రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 'బింబిసార' కాంటర్ వాహనాలు
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం 'బింబిసార' విడుదల తేదీ (ఆగస్టు 5) దగ్గరపడేకొద్దీ అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ చిత్రంతో వశిష్ఠ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ కోసం చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. 

తాజాగా, 'బింబిసార' కాంటర్ వాహనాలు రాష్ట్రం నలుమూలలా సందడి చేస్తున్నాయి. 'బింబిసార' చిత్రాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. విశాఖపట్నం, సమిస్రగూడెం, కాకినాడ, నందమూరు ప్రాంతాల్లో దర్శనమిస్తున్న ఈ వాహనాలకు భారీ స్క్రీన్లు అమర్చారు. ప్రజలు తిలకించేందుకు వీలుగా ఆ స్క్రీన్లపై 'బింబిసార' ట్రైలర్, ఇతర క్లిప్పింగ్ లు ప్రదర్శిస్తున్నారు. 

'బింబిసార' చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.
Bimbisara
Canter Vehicles
Trailer
Campaigne
Kalyan Ram
Vasishta
NTR Arts
Tollywood

More Telugu News