'బింబిసార' నుంచి లిరికల్ వీడియో రిలీజ్!

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్ 
  • చారిత్రక నేపథ్యంలో నడిచే కథ 
  • అంచనాలు పెంచుతున్న సినిమా 
  • ఈ నెల  5వ తేదీన సినిమా విడుదల
Bimbisara movie update

కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో 'బింబిసార' రూపొందింది. చారిత్రక నేపథ్యానికి సైన్స్ ఫిక్షన్ ను జోడించి ఒక కొత్త  జోనర్లో నిర్మించిన సినిమా ఇది. సంయుక్త మీనన్ - కేథరిన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తే, కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు. 'నీతో ఉంటే చాలు .. ' అంటూ ఈ ఎమోషనల్ సాంగ్ సాగుతోంది. ఈ పాటను కీరవాణి స్వరపరచడమే కాదు .. ఆయనే సాహిత్యాన్ని అందించగా, మోహన భోగరాజు - శాండిల్య ఆలపించారు. రాజుగాను ... సాధారణ యువకుడిగాను ఈ సాంగులో కల్యాణ్ రామ్ కనిపిస్తున్నాడు.

కల్యాణ్ రామ్ తన సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ లో నిర్మించిన సినిమా ఇది. ఈ నెల 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమా విషయంలో కల్యాణ్ రామ్ పూర్తి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందనేది చూడాలి.  

More Telugu News