Tollywood: హ‌ర్ ఘ‌ర్ తిరంగాపై మ‌హేశ్ బాబు ట్వీట్ ఇదిగో

tollywood super star mahesh babu promotes har ghar tiranga
  • 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌
  • స్వాతంత్య్ర దినోత్స‌వాన అన్ని ఇళ్ల‌పై జాతీయ జెండా ఎగుర‌వేయాల‌ని కేంద్రం పిలుపు
  • హ‌ర్ ఘ‌ర్ తిరంగా పేరిట హోరెత్తుతున్న ప్ర‌చారం
  • గ‌ర్వంగా భావిద్దామంటూ మ‌హేశ్ బాబు పిలుపు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి అవుతున్న త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వాలు దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 13 నుంచి 15 వ‌ర‌కు దేశ ప్ర‌జ‌లంతా త‌మ ఇళ్ల‌పై జాతీయ జెండాను ఆవిష్క‌రించాలంటూ కేంద్రం పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. హ‌ర్ ఘ‌ర్ తిరంగా పేరిట దేశ‌వ్యాప్తంగా ప్ర‌చారం హోరెత్తుతోంది.

ఈ ప్రచారంలో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూడా పాలుపంచుకున్నారు. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. త్రివ‌ర్ణ ప‌తాకం మ‌న గ‌ర్వకార‌ణ‌మ‌ని పేర్కొన్న ఆయ‌న త్రివ‌ర్ణ జాతీయ ప‌తాకాన్ని ఎగుర‌వేద్దామంటూ అంద‌రం ప్ర‌తిజ్ఞ చేద్దామంటూ ఆయ‌న పిలుపునిచ్చారు. హ‌ర్ ఘ‌ర్ తిరంగా హ్యాష్ ట్యాగ్‌ను ఆయ‌న త‌న ట్వీట్‌కు జ‌త చేశారు.
Tollywood
Mahesh Babu
Har Ghar Tiranga
BJP
Independence

More Telugu News