Chiranjeevi: ముంబైలో 'లైగర్' టీమ్ కు ఆశీస్సులు అందించిన చిరంజీవి, సల్మాన్ ఖాన్

Chiranjeevi and Salman Khan met Liger team in Mumbai
  • ముంబైలో ఉన్న చిరంజీవి, సల్మాన్ ఖాన్
  • గాడ్ ఫాదర్ లో ఇరువురిపై పాట చిత్రీకరణ
  • లైగర్ ను కలిసిన చిరు, సల్మాన్
  • ప్రపంచమే తమ వద్దకు వచ్చినట్టుందన్న చార్మీ
మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో వస్తున్న గాడ్ ఫాదర్ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరంజీవి, సల్మాన్ ఖాన్ లపై ప్రభుదేవా నృత్యదర్శకత్వంలో ఓ పాట తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి, సల్మాన్ ఖాన్ ముంబైలో ఉన్నారు. 

వీరిద్దరూ తాజాగా లైగర్ టీమ్ ను కలిశారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్, నిర్మాత చార్మీలను కలిసి వారికి తమ ఆశీస్సులు అందించారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్ లు తమ వద్దకు రావడంతో లైగర్ టీమ్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రపంచమే తమ వద్దకు కదిలి వచ్చినంత ఆనందం కలిగిందని చార్మీ తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొంది.
Chiranjeevi
Salman Khan
Liger
Mumbai

More Telugu News