ఏపీ మరో ఆరు నెలల్లో శ్రీలంకలా మారబోతోంది.. నన్ను ప్రధానిని చేయండి: కేఏ పాల్
- జగన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదన్న పాల్
- దేశాన్ని రక్షించుకోలేకపోతే రాష్ట్రాన్ని కూడా రక్షించుకోలేమని ఆవేదన
- తనను ప్రధానిని చేస్తే దేశాన్ని బాగు చేస్తానని హామీ
- వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి తెలంగాణ సీఎం అవుతానని ధీమా
జగన్ ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదన్న పాల్.. తనపై ఉన్న కేసులకు భయపడి కేంద్రాన్ని ఏమీ అడగలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో అవినీతి దారుణంగా పేరుకుపోయిందని, తనను ప్రధానిని చేస్తే దేశానికి మరమ్మతులు చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రిని అవుతానని పాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.