Gururaj Poojari: కామన్వెల్త్ గేమ్స్: వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు మరో పతకం

Another weight lifting medal for India in Commonwealth Games
  • బర్మింగ్ హామ్ లో కామన్వెల్త్ క్రీడలు
  • వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు రెండు పతకాలు
  • రజతం సాధించిన సంకేత్ సర్గర్
  • తాజాగా కాంస్యం నెగ్గిన గురురాజ్ పూజారి
  • అభినందనలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
బర్మింగ్ హామ్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ నేడు రెండో పతకం అందుకుంది. వెయిట్ లిఫ్టింగ్ అంశంలో గురురాజ్ పూజారి కాంస్యం సాధించాడు. ఇప్పటికే పురుషుల 55 కేజీల విభాగం సంకేత్ సర్గర్ రజతం సాధించడం తెలిసిందే. తాజాగా, పురుషుల 61 కేజీల విభాగం ఫైనల్లో గురురాజ్ 269 కేజీల బరువునెత్తి మూడోస్థానంలో నిలిచాడు. స్నాచ్ లో 118 కేజీలు, జెర్క్ లో 151 కేజీల బరువునెత్తాడు. గురురాజ్ గత కామన్వెల్త్ క్రీడల్లోనూ పతకం నెగ్గాడు. 

బర్మింగ్ హామ్ లో వెయిట్ లిఫ్టర్ల ప్రదర్శనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పతక విజేతలను అభినందించారు.
Gururaj Poojari
Bronze
Weight Lifting
Commonwealth Games
India
Birmingham
UK

More Telugu News