Aadi Saikumar: అందాల పాయల్ రోల్ హైలైట్ అవుతుందట!

Tees Maar Khan Movie Update
  • రిలీజ్ కి రెడీ అవుతున్న 'తీస్ మార్ ఖాన్'
  • కథానాయికగా అలరించనున్న పాయల్ 
  • రీసెంట్ గా వచ్చిన సాంగ్ కి మంచి రెస్పాన్స్ 
  • ఆగస్టు 19వ తేదీన సినిమా విడుదల 
ఆది సాయికుమార్ వరుస సినిమాలను చేస్తూ వెళుతున్నాడు. వాటిలో 'తీస్ మార్ ఖాన్' ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి కల్యాణ్ జీ దర్శకత్వం వహించాడు. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ఆది పినిశెట్టి సరసన నాయికగా పాయల్ రాజ్ పుత్ అలరించనుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆది సాయికుమార్  మాట్లాడుతూ .. "ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన సాంగ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాంటి ఒక సాంగ్ చేయడం కూడా నాకు ఇదే ఫస్టు టైమ్. సాంగ్ చూసిన వాళ్లంతా మా పెయిర్ చాలా బాగుందని అంటున్నారు. ఈ సినిమాకి పాయల్ ప్లస్ ..  తన పాత్ర హైలైట్. ఆమె అభిమానులకు పండగలాంటి సినిమా ఇది. 

నాకు ..  పాయల్ కి మధ్య సాంగ్స్ మాత్రమే కాదు సీన్స్ కూడా చాలా బాగుంటాయి. మా లవ్ ట్రాక్ చాలా బాగుంటుంది. ఎంటర్టైన్ మెంట్ తో పాటు చిన్న ఎమోషన్ కూడా ఉంటుంది. ఎక్కడా ఏ విషయంలోను రాజీ పడకుండా చేసిన సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Aadi Saikumar
Payal
Tees Maar Khan Movie

More Telugu News