Telangana: రాజ‌గోపాల్ రెడ్డి విష‌యంలో ప్లాన్ బీ సిద్ధంగా ఉంది: భ‌ట్టి విక్ర‌మార్క‌

tclp leader comments on komatireddy rajagopal reddy issue
  • ప్లాన్ ఏ విఫ‌ల‌మైతే ప్లాన్ బీ సిద్ధంగా ఉంద‌న్న భ‌ట్టి
  • రాజ‌గోపాల్ రెడ్డి పార్టీని వీడ‌కుండా ఉండ‌ట‌మే ల‌క్ష్యమ‌న్న టీసీఎల్పీ నేత‌
  • ఢిల్లీ రావాలంటూ కోమ‌టిరెడ్డికి పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు
కాంగ్రెస్ పార్టీని వీడే దిశ‌గా సాగుతున్న న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పార్టీలోనే కొన‌సాగేలా త‌మ వ‌ద్ధ వ్యూహాలు ఉన్నాయ‌ని టీసీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క చెప్పారు. ఈ మేర‌కు రాజ‌గోపాల్ రెడ్డి విష‌యంపై శ‌నివారం మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాజగోపాల్ రెడ్డి పార్టీలోనే కొన‌సాగేలా ప్లాన్ బీని కూడా సిద్ధంగా ఉంచుకున్నామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

రాజ‌గోపాల్ రెడ్డి విష‌యంలో ప్లాన్ ఏ విఫ‌ల‌మైతే ఏం చేస్తార‌న్న ప్ర‌శ్న‌కు భ‌ట్టి విక్ర‌మార్క పై విధంగా స‌మాధానం చెప్పారు. పార్టీకి విధేయుడిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొన‌సాగేలా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామని ఆయ‌న చెప్పారు. కోమ‌టిరెడ్డిని పార్టీని వీడ‌కుండా ఉంచ‌డ‌మే ల‌క్ష్యంగా సాగుతున్నామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. పార్టీలో రాజ‌గోపాల్ రెడ్డికి త‌లెత్తిన ఇబ్బందులేమిటో తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా ప‌నిచేస్తున్నామ‌ని భ‌ట్టి వివ‌రించారు. 

ఇదిలా ఉంటే... ఢిల్లీకి రావాల‌ని రాజ‌గోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి శ‌నివారం పిలుపు వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో పర్య‌టిస్తున్నాన‌ని, ప‌ర్య‌ట‌న పూర్తయిన త‌ర్వాత ఢిల్లీకి వ‌స్తాన‌ని ఆయ‌న పార్టీ పెద్ద‌ల‌కు చెప్పిన‌ట్లు స‌మాచారం.
Telangana
Congress
Komatireddy Raj Gopal Reddy
Mallu Bhatti Vikramarka
TCLP Leader

More Telugu News