Fierce dinosaur: టీ–రెక్స్​ కన్నా భీకర డైనోసార్​.. అస్థి పంజరం రూ.48.5 కోట్లు

Fierce dinosaur skeleton sells for whopping amount
  • తొలినాటి డైనోసార్లలో ఒకటైన గొర్గోసారస్ అస్థి పంజరాన్ని వేలం వేసిన సోత్ బీ వేలంశాల
  • పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవున్న డైనోసార్
  • 7.7 కోట్ల ఏళ్ల కిందట తిరుగాడిన డైనోసార్.. టీ–రెక్స్ కన్నా ప్రమాదకరం
అదో అస్థి పంజరం.. అదీ కోట్ల ఏళ్ల కిందటిది. కానీ ఏకంగా రూ. 48.5 కోట్ల ధర పలికింది. మరి అది సాదా సీదా అస్థి పంజరం కాదు.. డైనోసార్లలో భయంకరమైన టైరనోసారస్ రెక్స్ (టీ రెక్స్) కంటే ముందునాటి గోర్గోసారస్ డైనోసార్ అస్థి పంజరం. అంతేకాదు.. ఇది టి రెక్స్ కంటే కూడా వేగంగా కదులుతూ దాడి చేయగలదని, దీని బలం కూడా ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.

టీ రెక్స్ కన్నా ప్రమాదకరం..
తొలితరం డైనోసార్లు తిరుగాడిన క్రేటాషియస్ కాలానికి చెందిన భయానక మాంసాహార డైనోసార్లలో గొర్గోసారస్ ఒకటని.. అమెరికా, కెనడా ప్రాంతాల్లో జీవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గొర్గోసారస్ అస్థి పంజరాన్ని 2018లో అమెరికాలోని మోంటానాలో జుడిత్ నది సమీపంలో గుర్తించారు. పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉన్న ఈ అస్థి పంజరం 7.7 కోట్ల ఏళ్ల కింద తిరుగాడిన డైనోసార్ దిగా నిర్ధారించారు.
  • ప్రఖ్యాత సోత్ బీ వేలం శాల జులై 21 నుంచి న్యూయార్క్ లో దీనిని ప్రదర్శనకు ఉంచింది. తాజాగా వేలం వేయగా.. 6.1 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.48.5 కోట్లు) పలికింది.
  • గొర్గోసారస్ డైనోసార్లు రెండు టన్నుల వరకు బరువు తూగేవని.. టీ రెక్స్ కన్నా వేగంగా, బలంగా దాడి చేసేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • గార్గోసారస్ లు ఏకంగా 42 వేల న్యూటన్ల బలంతో కొరికేసేవి అని అంచనా వేశారు. మనకు తెలిసిన అత్యంత బలమైన సింహాలు, పులులు కొరికే బలం నాలుగైదు వేల న్యూటన్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే సింహం కంటే పదింతలు బలంతో దాడి చేసేదన్న మాట.
  • ఇంతకుముందు 1997లో టీ–రెక్స్ డైనోసార్ అస్థి పంజరాన్ని వేలం వేయగా 8.36 మిలియన్ డాలర్లకు (రూ.66.36 కోట్లు) అమ్ముడు పోయింది.  
  • 2020లో మరో టీ–రెక్స్ అస్థి పంజరానికి ఏకంగా 31.8 మిలియన్ డాలర్లు (రూ.252.5 కోట్లు) పలకడం గమనార్హం.
Fierce dinosaur
dinosaur
dinosaur skeleton
sotheby
Sotheby Auction House
Auction
Science
Offbeat
International
T Rex
Gorgosaurus

More Telugu News