Students: అనకాపల్లి జిల్లా పూడిమడిక బీచ్ లో ఏడుగురు విద్యార్థుల గల్లంతు... దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అమర్ నాథ్

Seven students missing at Pudimadaka beach
షార్ట్స్‌లో చూడండి
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. విహారానికి వచ్చిన విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన 15 మంది విద్యార్థులు పూడిమడక బీచ్ లో సముద్ర స్నానాలకు దిగారు. అయితే అలల తాకిడికి వారిలో ఏడుగురు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. 

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మంత్రి గుడివాడ అమర్ నాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను అడిగి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Go Back to Shorts
Students
Missing
Pudimadaka Beach
Anakapalli District

More Telugu News