West Bengal: బెంగాల్ మంత్రి పార్థా చ‌ట‌ర్జీపై వేటు... కేబినెట్ నుంచి తొల‌గించిన దీదీ

  • టీచ‌ర్ల నియామ‌కాల్లో చ‌ట‌ర్జీ అక్ర‌మాలు
  • స‌న్నిహితురాలి ఇంటిలో నోట్ల క‌ట్ట‌లు దాచిన వైనం
  • ఈడీ సోదాల్లో నోట్ల కట్టలు, బంగారం ల‌భ్యం
Partha Chatterjee sacked from West Bengal Cabinet

ఉపాధ్యాయుల నియామ‌కం కుంభ‌కోణంలో అడ్డంగా బుక్కయిన ప‌శ్చిమ బెంగాల్ మంత్రి పార్థా చ‌ట‌ర్జీపై ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెనర్జీ వేటు వేశారు. త‌న కేబినెట్ నుంచి చ‌ట‌ర్జీని తొల‌గిస్తూ గురువారం దీదీ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ కేసులో పార్థా చ‌ట‌ర్జీ ఇప్ప‌టికే అరెస్టయిన సంగ‌తి తెలిసిందే. 

ప‌శ్చిమ బెంగాల్ టీచ‌ర్ల కుంభ‌కోణం జ‌రిగిన వ్య‌వ‌హారంపై ద‌ర్యాప్తు మొద‌లుపెట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) గ‌త వారం చ‌ట‌ర్జీ స‌న్నిహితురాలి ఇంటిలో సోదాలు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సోదాల్లో గుట్టలుగుట్ట‌లుగా క‌రెన్సీ క‌ట్ట‌లు దొరికాయి. తాజాగా బుధ‌వారం కూడా మ‌రో ఇంటిలో సోదాలు చేసిన ఈడీ... అక్క‌డ కూడా రూ.41 కోట్ల న‌గ‌దుతో పాటు 5 కిలోల బంగారం దొరికింది.

More Telugu News