Adhir Ranjan Chowdhury: రాష్ట్రపత్ని అనడం తప్పే.... కానీ వాళ్లు సోనియా విషయంలో, శశిథరూర్ భార్య విషయంలో ఏమన్నారు?: అధిర్ రంజన్ చౌదరి

Congress leader Adhir Ranjan Chowdhury says he accepted his mistake
  • ముర్మును రాష్ట్రపత్ని అన్న కాంగ్రెస్ నేత
  • భగ్గుమన్న బీజేపీ నేతలు 
  • వివిధ వర్గాల నుంచి విమర్శలు
  • వెనక్కి తగ్గిన అధిర్ రంజన్ చౌదరి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత అధిర్ రంజన్ చౌదరి 'రాష్ట్రపత్ని' అని సంబోధించడం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అధిర్ రంజన్ చౌదరి వెనక్కి తగ్గారు. తాను 'రాష్ట్రపత్ని' అనడం తప్పేనని అంగీకరించారు. అయితే బీజేపీ నేతలపై మండిపడ్డారు. 

"ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వాళ్లు ఏమన్నారు? శశిథరూర్ భార్య గురించి ఏం మాట్లాడారు? రేణుకా చౌదరిపై ఏమన్నారు? అంటూ ప్రశ్నించారు. తాను రాష్ట్రపత్ని వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతానని చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ కోరి, ఆమెను వ్యక్తిగతంగా కలిసి వివరిస్తారని వెల్లడించారు. ఎల్లుండి ఆమె అపాయింట్ మెంట్ లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.
Adhir Ranjan Chowdhury
Rashtra Patni
Droupadi Murmu
President Of India
Congress
BJP

More Telugu News