స్కూల్ టీచర్ గా రోబోలు.. హైదరాబాద్ లో ప్రైవేటు స్కూల్ కొత్త ప్రయోగం
- ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కొత్త ప్రయత్నం
- తరగతి గదుల్లో టీచర్లకు సాయంగా రోబోలు
- అవసరమైతే విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పే నైపుణ్యం
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ) సాయంతో ఈ రోబోలు టీచర్ పాత్రను నిర్వహిస్తున్నాయి. పాఠశాలలో రోబో టీచర్ ను ప్రవేశపెట్టడం అన్నది దేశంలోనే తొలిసారిగా ఈ స్కూల్ యాజమాన్యం పేర్కొంది. ఈగల్ రోబోల గురించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సైతం వివరించడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు, పూణెలో ఉన్న మూడు విద్యా కేంద్రాల్లోనూ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ రోబోలను రంగంలోకి దింపింది.
ఐదు నుంచి 11వ తరగతులకు ఈ రోబోలు పాఠాలు కూడా చెబుతాయి. 30కు పైగా భాషల్లో పాఠాలు బోధించగలవు. విద్యార్థుల సందేహాలు తీర్చగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్ టాప్ ల నుంచి యాక్సెస్ చేసుకునే సదుపాయం కూడా ఉంది.