Sukumar: అందుకే బుచ్చిబాబు 'పుష్ప 2' వైపు వెళ్లాడట!

Pushpa 2 movie update
  • 'పుష్ప 2' స్క్రిప్ట్ పై జరుగుతున్న కసరత్తు 
  • సుకుమార్ టీమ్ లో జాయినైన బుచ్చిబాబు 
  • ఈ ప్రాజెక్టు తరువాతనే బుచ్చిబాబు సినిమా 
  • ఎన్టీఆర్ తోనే చేసే అవకాశం
సుకుమార్ దగ్గర దర్శకత్వ విభాగంలో పనిచేసిన బుచ్చిబాబు, ఆయన ప్రోత్సాహంతోనే 'ఉప్పెన' సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత సినిమాను ఎన్టీఆర్ తో చేయనున్నట్టుగా బుచ్చిబాబు చెప్పాడు. అయితే ఎన్టీఆర్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందువలన మరికొంత సమయం పట్టేలా ఉంది. 

ఈ లోగా మరో కథతో .. మరో హీరోతో సినిమా చేయాలని బుచ్చిబాబు నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా కూడా వార్తలు వచ్చాయి. అయితే మరో సినిమా చేసే బదులు .. 'పుష్ప 2' సినిమా విషయంలో తనకి తోడుగా ఉండమని సుకుమార్ కోరడంతో బుచ్చిబాబు అటు వైవు వెళ్లిపోయాడు. 

'పుష్ప2' కథా చర్చలకు సంబంధించిన విషయాల్లో సుకుమార్ తో పాటు బుచ్చిబాబు కూడా పాలుపంచుకుంటున్నాడు. 'పుష్ప 2' పాన్ ఇండియా సినిమా కావడం వలన , సహజంగానే సుకుమార్ కి టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అన్నీ తెలిసిన ఇలాంటి ఒక శిష్యుడు అవసరమని భావించే ఆయన పిలిపించాడని అంటున్నారు. ఈ ప్రాజెక్టు తరువాతనే ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఉంటుందని అనుకోవచ్చు.
Sukumar
Buchibabu
pushpa 2 Movie

More Telugu News