BV Srinivas: యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ జుట్టు పట్టుకున్న పోలీసులు... వీడియో ఇదిగో!

Police manhandled with Youth Congress President
  • ధరల పెరుగుదల, జీఎస్టీకి వ్యతిరేకంగా నిరసనలు
  • ఢిల్లీలో కాంగ్రెస్ ధర్నా.. పాల్గొన్న రాహుల్ గాంధీ
  • కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు
  • శ్రీనివాస్ పట్ల దురుసుగా వ్యవహరించిన వైనం
ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో ధరల పెరుగుదల, జీఎస్టీకి వ్యతిరేకంగా రాజ్ పథ్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ఈ నిరసనలకు పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. 

కాగా, యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించడం వీడియోలో దర్శనమిచ్చింది. శ్రీనివాస్ ను వాహనంలోకి ఎక్కించే సమయంలో పోలీసులు ఆయన జుట్టు పట్టుకున్నారు. ఆయనను వాహనంలోకి నెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, వాహనంలోంచే బీవీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో తమను అణచివేయలేరని అన్నారు. తీవ్ర వాగ్వివాదం నడుమ పోలీసులు ఆయనను అక్కడ్నించి తరలించగలిగారు.
BV Srinivas
Manghandling
Police
Youth Congress
New Delhi

More Telugu News