Andhra Pradesh: రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ముతో ఏపీ గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ భేటీ

ap governor Biswa Bhusan Harichandan called on President Droupadi Murmu at Rashtrapati Bhavan
  • రాష్ట్రప‌తి భ‌వన్‌లో ముర్మును క‌లిసిన హ‌రిచంద‌న్‌
  • రాష్ట్రప‌తిగా ఎన్నికైనందుకు అభినంద‌నలు తెలిపిన వైనం
  • ఇద్ద‌రూ ఒడిశాకు చెందిన వారే
భార‌త నూత‌న రాష్ట్రప‌తిగా సోమ‌వారం ప‌దవీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ద్రౌప‌ది ముర్ముకు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల నుంచి అభినంద‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగ‌బ‌ద్ధ ప‌ద‌వుల్లో ఉన్న వారు నేరుగా ఢిల్లీలోని రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కే వెళ్లి ఆమెకు అభినంద‌న‌లు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్ర‌స్తుతం ఢిల్లీ టూర్‌లో ఉన్న ఏపీ గ‌వ‌ర్నర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ మంగ‌ళ‌వారం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ద్రౌప‌ది ముర్మును క‌లిశారు. 

భార‌త రాష్ట్రప‌తిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ముర్మును ఆయ‌న అభినందించారు. ఇదిలా ఉంటే... ముర్ముతో పాటు హ‌రిచంద‌న్ కూడా ఒడిశా రాష్ట్రానికే చెందిన వారు. ఇద్ద‌రూ త‌మ రాష్ట్ర మంత్రివర్గాల్లో స‌భ్యులుగా కొన‌సాగిన వారే. హ‌రిచంద‌న్ మాదిరిగా గ‌తంలో ముర్ము కూడా ఝార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు.
Andhra Pradesh
Draupadi Murmu
Biswabhusan Harichandan
AP Governor
Rashtrapati Bhavan
President Of India

More Telugu News