Recruitment: కేంద్ర ఆరోగ్య శాఖలో ఉద్యోగ నియామకాలంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు: జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్

  • ఉద్యోగాల భర్తీ అంటూ ఫేక్ నోటిఫికేషన్లు
  • ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని వివరణ  
  • నకిలీ లెటర్లతో నిరుద్యోగులు మోసపోరాదని సూచన
National Health Mission responds to fake notifications

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.  

ఉద్యోగ నియామకాలకు జాతీయ హెల్త్ మిషన్ ఏపీ విభాగం ఎండీ తరఫున ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని వెల్లడించారు. ఇలాంటి ప్రచారాలతో నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు. ఆయుష్మాన్ భారత్ కింద ఎంఎల్ హెచ్ పీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు ఏపీలో రిక్రూట్ మెంట్ జరుగుతున్నట్టు నకిలీ లెటర్లను తయారుచేశారని వెల్లడించారు. ఈ విధంగా ఫేక్ లెటర్లు తయారుచేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ హెచ్చరించారు. 

ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఎలాంటి ఉద్యోగాల భర్తీ చేపట్టినా పత్రికా ప్రకటన ద్వారా తెలియజేస్తామని, సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ నోటిఫికేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.

More Telugu News