ఆర్థికమాంద్యం భయాలు.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

26-07-2022 Tue 15:41 | Business
  • 497 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 147 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3.45 శాతం నష్టపోయిన ఇన్ఫోసిన్ షేర్ విలువ
Markets ends in losses
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత మళ్లీ పుంజుకోలేదు. ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలహీనపరిచాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 497 పాయింట్లు నష్టపోయి 55,268కి పడిపోయింది. నిఫ్టీ 147 పాయింట్లు కోల్పోయి 16,483కి దిగజారింది. 

సెన్సెక్స్ టాప్ గెయినర్స్
బజాజ్ ఫిన్ సర్వ్ (5.47%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.47%), భారతి ఎయిర్ టెల్  (0.63%), బజాజ్ ఫైనాన్స్ (0.46%), ఐటీసీ (0.42%). 

టాప్ లూజర్స్
ఇన్ఫోసిస్ (-3.45%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.98%), యాక్సిస్ బ్యాంక్ (-2.93%), డాక్టర్ రెడ్డీస్ (-2.75%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-2.28%).