Rajya Sabha: రాజ్యసభ నుంచి ముగ్గురు టీఆర్ఎస్ సభ్యులు సహా 19 మంది సస్పెన్షన్

  • నిరసనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
  • నిన్న లోక్ సభలో నలుగరు కాంగ్రెస్ సభ్యులపై వేటు
  • నేడు రాజ్యసభలో విపక్షాల నిరసనలు
  • సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారంటూ వేటు
19 members including three TRS MPs suspended from Rajya Sabha

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో విపక్షాల నిరసనల పర్వం కొనసాగుతోంది. నిన్న లోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ సభ్యులు సస్పెన్షన్ కు గురికాగా, నేడు 19 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ విధించారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతున్నారని, బిగ్గరగా నినాదాలు చేస్తున్నారని వారిపై ఈ వారాంతం వరకు వేటు వేశారు. అనంతరం సభ రేపటికి వాయిదాపడింది. సస్పెండైన వారిలో టీఆర్ఎస్ ఎంపీలు లింగయ్య యాదవ్, రవీంద్ర వద్దిరాజు, దీవకొండ దామోదర్ రావు కూడా ఉన్నారు.

సస్పెండైన ఇతర ఎంపీలు వీరే...

సుస్మితా దేవ్- తృణమూల్
డాక్టర్ శంతను సేన్- తృణమూల్
మౌసమ్ నూర్- తృణమూల్
శాంతా చెత్రి- తృణమూల్
డోలా సేన్- తృణమూల్ 
అభిర్ రంజన్ దాస్- తృణమూల్ 
నదిముల్ హక్- తృణమూల్ 
కనిమొళి- డీఎంకే 
హమీద్ అబ్దుల్లా- డీఎంకే 
గిర్ రంజన్- డీఎంకే 
ఎన్నార్ ఎలాంగో- డీఎంకే 
ఎస్. కల్యాణసుందరమ్- డీఎంకే 
ఎం.షణ్ముగం- డీఎంకే 
ఏ.ఏ. రహీమ్- సీపీఎం 
డాక్టర్ వి.శివదాసన్- సీపీఎం 
పి.సంతోష్ కుమార్- సీపీఐ 



More Telugu News