రాష్ట్రపతి భవన్‌కు వచ్చి, ముర్ముకు ప్రధాని అభినందన... ఫొటో ఇదిగో
- సోమవారమే రాష్ట్రపతిగా ముర్ము పదవీ ప్రమాణం
- నిన్న రాత్రికే అధికారిక నివాసం రాష్ట్రపతి భవన్‌లోకి ఎంట్రీ
- రాష్ట్రపతి భవన్‌లో తొలిసారిగా ముర్ముతో మోదీ భేటీ
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన ముర్ముకు ఇంతకుముందు ఢిల్లీలో ఓ బంగ్లాను కేటాయించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల్లో ముర్ము ఘన విజయం సాధించడం, రాష్ట్రపతిగా పదవీ ప్రమాణం చేయడంతో ఆమె రాష్ట్రపతి భవన్‌లో సోమవారం రాత్రే అడుగుపెట్టారు.