ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా చేస్తా: 'మాచర్ల ధమ్కీ' రిలీజ్

Macharla Niyojakavargam movie update
  • పొలిటికల్ డ్రామాగా 'మాచర్ల నియోజకవర్గం'
  • నితిన్ సరసన నాయికలుగా కేథరిన్ - కృతి శెట్టి
  • అంజలి ఐటమ్ సాంగుకి మంచి రెస్పాన్స్
  • ఈ నెల 30వ తేదీన ట్రైలర్ రిలీజ్ 
  • ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదల  
నితిన్ హీరోగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమా రూపొందింది. ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాతో దర్శకుడిగా రాజశేఖర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. పోలిటికల్ డ్రామా నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమాలో నితిన్ ప్రభుత్వ అధికారిగా నటించగా, ఆయన సరసన నాయికలుగా కేథరిన్ - కృతి శెట్టి అలరించనున్నారు.

ఈ సినిమాను ఆగస్టు 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'మాచర్ల ధమ్కీ' పేరుతో ఒక వీడియోను వదిలారు. 'మహాభారతంలో ధర్మాన్ని కాపాడటం కోసం లక్షలాదిమంది తమ సమాధులను పునాదులుగా వేశారు .. మాచర్ల నియోజక వర్గంలో ధర్మాన్ని కాపాడటం కోసం నా సమాధిని పునాదిగా వేయడానికి నేను సిద్ధం" అంటూ ఈ వీడియో సాగింది. 

ట్రైలర్ ను ఈ నెల 30వ తేదీన వదలనున్నట్టు ఈ వీడియో ద్వారా తెలియజేశారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇటీవల వదిలిన అంజలి ఐటమ్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సముద్రఖని పోషించిన 'రాజప్ప' పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.
Go Back to Shorts
Nithin
Catherine
Krithi Shetty
Macharla Niyojakavargam Movie

More Telugu News