President Of India: దేశాధినేతల బంగ్లాల్లో అతిపెద్ద‌ది రాష్ట్రప‌తి భ‌వ‌న్‌!... కిష‌న్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో ఇదిగో!

union minister kishan reddy posts a video that shows Rashtrapati Bhawan greatness
  • భార‌త రాష్ట్రప‌తిగా ముర్ము ప్ర‌మాణ స్వీకారం నేప‌థ్యంలో వీడియో విడుద‌ల‌
  • రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లోని దాదాపుగా అన్ని విభాగాల‌ను ప్ర‌స్తావించిన వైనం 
  • 6.30 నిమిషాల నిడివి క‌లిగిన వీడియో
భార‌త రాష్ట్రప‌తి అధికారిక నివాసం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు సంబంధించిన ఔన్న‌త్యాన్ని చాటుతూ కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర వీడియోను పోస్ట్ చేశారు. రాష్ట్రప‌తి భ‌వ‌న్ గొప్ప‌త‌నాన్ని చాటుతూ సాగిన ఈ వీడియోలో... రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లోని ఆయా విభాగాలు, వాటి విస్తీర్ణం.. త‌దిత‌రాల‌ను పొందుప‌రిచారు. భార‌త రాష్ట్ర‌ప‌తిగా ద్రౌప‌ది ముర్ము సోమ‌వారం ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన నేప‌థ్యంలో కిష‌న్ రెడ్డి పోస్ట్ చేసిన వీడియో వైర‌ల్‌గా మారింది.

ప్ర‌పంచంలోని అన్ని దేశాల అధినేత‌ల బంగ్లాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే... వాట‌న్నింటిలోకి అతి పెద్ద‌దిగా రాష్ట్రప‌తి భ‌వ‌న్ నిలుస్తుంద‌ని స‌ద‌రు వీడియోకు కిష‌న్ రెడ్డి ఓ కామెంట్‌ను జ‌త చేశారు. 6.30 నిమిషాల నిడివి క‌లిగిన ఈ వీడియోలో రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లోని గార్డెన్ల నుంచి అందులోని వివిధ కార్య‌క్ర‌మాల కోసం నిర్దేశించిన మందిరాల‌ను ప్ర‌స్తావించారు.
President Of India
Rashtrapati Bhavan
Draupadi Murmu
G. Kishan Reddy
BJP

More Telugu News