Super Splendor: హీరో మోటోకార్ప్ నుంచి సూపర్ స్ల్పెండర్ ఆల్ బ్లాక్ వేరియంట్

Hero Motocorp set to bring Super Splendor All Black variant
  • అంతా నలుపు రంగుతో సూపర్ స్ల్పెండర్
  • టీజర్ రిలీజ్ చేసిన హీరో మోటోకార్ప్
  • త్వరలో భారత మార్కెట్లోకి విడుదల
  • ఎక్స్ షోరూం ధర రూ.81 వేలు ఉండే అవకాశం
దేశీయ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన సూపర్ స్ల్పెండర్ శ్రేణిలో కొత్త వేరియంట్ తీసుకువస్తోంది. పూర్తి నలుపు రంగులో ఉన్న సూపర్ స్ల్పెండర్ టీజర్ ను హీరో మోటోకార్ప్ సోషల్ మీడియాలో పంచుకుంది. త్వరలోనే ఇది భారత మార్కెట్లోకి రానుంది. 

ఇది 124.7 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ సహితం. 5 స్పీడ్ గేర్ బాక్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో కూడిన ఈ ఆల్ బ్లాక్ వేరియంట్ లో టెలిస్కోపిక్ ఫోర్క్ ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జార్బర్లు పొందుపరిచారు. కాగా, దీని ధర రూ.81,000 (ఎక్స్ షోరూం) ఉండొచ్చని తెలుస్తోంది. మార్కెట్లో హోండా షైన్, టీవీఎస్ రైడర్ లకు హీరో సూపర్ స్ల్పెండర్ గట్టిపోటీ ఇస్తోంది.
Super Splendor
All Black
Hero Motocorp
India

More Telugu News