తెలంగాణలో మరో 581 మందికి కరోనా... పూర్తి వివరాలు ఇవిగో!

  • గత 24 గంటల్లో 28,306 కరోనా పరీక్షలు
  • హైదరాబాదులో 227 కొత్త కేసులు  
  • కరోనా నుంచి కోలుకున్న 645 మంది
Telangana corona cases report

తెలంగాణలో కరోనా రోజువారీ కేసులు 500కి పైబడి నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో 28,306 శాంపిల్స్ పరీక్షించగా, 581 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా హైదరాబాదులో 227 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 45, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40, పెద్దపల్లి జిల్లాలో 30, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26, మంచిర్యాల జిల్లాలో 24, నల్గొండ జిల్లాలో 22, ఖమ్మం జిల్లాలో 20 కేసులు గుర్తించారు.

అదే సమయంలో 645 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణలో ఇప్పటిదాకా 8,14,884 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,06,207 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,566 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

More Telugu News