ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరిన కేసీఆర్... సీఎం వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు పయనం
- బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో పయనం
- రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం
- పలు పార్టీల నేతలతో కేసీఆర్ మంతనాలు సాగించే అవకాశం
కేసీఆర్ ఢిల్లీ టూర్ ఎన్ని రోజుల పాటు జరుగుతుందన్న విషయంపై స్పష్టమైన సమాచారమేదీ లేదు. అయితే, రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలో కేసీఆర్ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో పలు పార్టీలకు చెందిన జాతీయ స్థాయి నేతలతో కేసీఆర్ మంతనాలు సాగిస్తారని సమాచారం.