Rajinikanth: రజనీకాంత్ కు ఆదాయపన్ను శాఖ సత్కారం

  • పన్నులు సకాలంలో చెల్లిస్తున్నందుకు అభినందన
  • రజనీకాంత్ తరఫున అవార్డ్ స్వీకరించిన ఐశ్వర్య
  • ప్రదానం చేసిన తెలంగాణ గవర్నర్ 
Rajinikanth honoured by Income Tax Department Aishwaryaa Rajinikanth accepts award

ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ఆదాయపన్ను శాఖ నుంచి ప్రత్యేక గౌరవాన్ని అందుకున్నారు. పన్నులను సకాలంలో చెల్లిస్తున్నందుకు ఆయన్ను అభినందిస్తూ ఓ అవార్డ్ ను సర్టిఫికెట్ రూపంలో ఆదాయపన్ను శాఖ ప్రదానం చేసింది. దీన్ని రజనీకాంత్ తరఫున ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ స్వీకరించారు. 

ఆదాయపన్ను శాఖ దినోత్సవం సందర్భంగా ఆదివారం చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డ్ బహూకరణ జరిగింది. ఈ విషయాన్ని ఐశ్వర్య తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సర్టిఫికెట్ ను అందించారు. ‘‘సకాలంలో, అధిక పన్నులు చెల్లించే వ్యక్తి కుమార్తెగా గర్విస్తున్నాను. ఆదాయపన్ను శాఖ తమిళనాడు, పుదుచ్చేరికి ఎన్నో ధన్యవాదాలు’’ అని ఐశ్వర్య పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ చూసిన రజనీ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున కామెంట్ల వర్షం కురుస్తోంది. 

More Telugu News